Skip to main content

ట్రిపుల్ తలాక్‌కు రాష్ట్రపతి ఆమోదం

ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కురాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూలై 31న ఆమోదం తెలిపారు.
ఈ బిల్లును జూలై 25న లోక్‌సభ, 30న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21 నుంచి కొనసాగుతోన్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ చట్టం అందుబాటులోకి రానుంది. ఇకపై ఫోన్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా ఇతర ఏ మార్గంలో తలాక్ చెప్పినా అది నేరమే. ఈ చట్టం ప్రకారం తలాక్ చెల్లదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Published date : 02 Aug 2019 05:27PM

Photo Stories