Skip to main content

ట్రాయ్ నూతన చైర్మన్‌గా నియమితులైన బ్యూరోక్రాట్?

టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా నియమితులయ్యారు.
Current Affairs
ఆయన పదవీకాలం మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందైతే అది) ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 30తో తీరిపోనుంది. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో వఘేలా కూడా ఉన్నారు.

కోలార్ బంగారం గనుల్లో అన్వేషణ ప్రారంభం
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారం గనుల్లో అన్వేషణను మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్) సెప్టెంబర్ 28న ప్రారంభించినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కోలార్ బంగారం గనుల్లోని బెట్రేయస్వామి బ్లాక్‌లో అన్వేషణ ప్రారంభమైందని తెలియజేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా
Published date : 29 Sep 2020 05:50PM

Photo Stories