Skip to main content

టోక్యో ఒలింపిక్స్‌కు శివ్‌పాల్ సింగ్ అర్హత

పాచెఫ్‌స్ట్రూమ్: భారత జావెలియన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
Current Affairsదక్షిణాఫ్రికాలో జరిగిన ఏసీఎన్‌డబ్ల్యూ అథ్లెటిక్స్ మీట్‌లో శివ్‌పాల్ సింగ్ ఈటెను 85.47 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 85 మీటర్లను కూడా శివ్‌పాల్ సింగ్ అధిగమించాడు. భారత్ తరఫున టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెండో జావెలియన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్. ఇప్పటికే నీరజ్ చోప్రా ‘టోక్యో’ బెర్త్ సాధించాడు.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
టోక్యో ఒలింపిక్స్ గేమ్స్‌కు శివ్‌పాల్ సింగ్ అర్హత
ఎవరు : శివ్‌పాల్ సింగ్
Published date : 11 Mar 2020 05:34PM

Photo Stories