Skip to main content

తిరుపతిలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Current Affairsస్కిల్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలపై డిసెంబర్ 18న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు కావాలని సీఎం సూచించారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలు
రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ.. అవసరమైతే ఇంకోటి ఏర్పాటు చేసి, వాటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటన్నింటిపై ఏర్పాటయ్యే యూనివర్సిటీ వీటిని గైడ్ చేస్తుందన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారిలో మరింతగా నైపుణ్యం పెంపొందించేందుకే వీటిని తీసుకు వస్తున్నామని చెప్పారు.

స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ పని తీరు ఇలా..
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలకు చుక్కానిలా ఉంటుంది.
  • ఎప్పటికప్పుడు వాటికి దిశ, నిర్దేశం చేస్తుంది.
  • ఎప్పుడు ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలో సూచిస్తుంది.
  • అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ

హైఎండ్ స్కిల్ వర్సిటీ పని తీరు ఇలా..
  • నైపుణ్యవంతులను మరింతగా తీర్చిదిద్దడం
  • రోబోటిక్స్‌లో ప్రపంచంతో పోటీ పడేలా శిక్షణ
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించేలా కసరత్తు
  • విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చేలా అదనపు నైపుణ్యాలు సమకూర్చడం

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 19 Dec 2019 06:07PM

Photo Stories