టీటీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత జంట?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్ వేదికగా టేబుల్ టెన్నిస్ (టీటీ)లో తొలిసారి ప్రవేశపెట్టనున్న మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత ప్రాతినిధ్యం ఖరారైంది.
మార్చి 20న ఖతర్ రాజధాని దోహాలో ముగిసిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జంట ఆచంట శరత్ కమల్–మనిక బత్రా విజేతగా నిలిచి 'టోక్యో' బెర్త్‌ను దక్కించుకుంది. ఫైనల్లో శరత్ కమల్–మనిక జోడీ 8–11, 6–11, 11–5, 11–6, 13–11, 11–8తో టాప్ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జియోన్ జిహీ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది.
సియోల్ ఒలింపిక్స్‌లో తొలిసారి...
1988 సియోల్ ఒలింపిక్స్‌లో తొలిసారి టీటీ క్రీడకు చోటు కల్పించారు. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి పురుషుల, మహిళల డబుల్స్ ఈవెంట్‌లను తొలగించి వాటి స్థానంలో టీమ్ ఈవెంట్‌కు స్థానం కల్పించారు. మూడు ఒలింపిక్స్ క్రీడల తర్వాత టీమ్ ఈవెంట్స్‌కు జతగా మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టీటీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత జంట?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఆచంట శరత్ కమల్–మనిక బత్రా
ఎక్కడ : దోహా, ఖతర్
ఎందుకు : ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలిచినందున

Published date : 22 Mar 2021 05:57PM