Skip to main content

తీర గస్తీనౌక ఐసీజీఎస్ వీర ప్రారంభం

భారత తీర రక్షక దళానికి చెందిన అధునాతన తీర గస్తీ నౌక ‘ఐసీజీఎస్ వీర’ను భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఏప్రిల్ 15న ప్రారంభించారు.
ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ గస్తీనౌక 98 మీటర్ల పొడవు, 2200 టన్నుల బరువు కలిగి, గంటకు 26 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఐసీజీఎస్ వీర కమాండింగ్ అధికారిగా కమాండెంట్ గిరీశ్ దత్ రాతూరి బాధ్యతలు స్వీకరించారు.

ఐసీజీఎస్ వీర ప్రారంభం సందర్భంగా రావత్ మాట్లాడుతూ... ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద తీర భద్రతా దళంగా భారత్ ఆవిర్భవించిందని చెప్పారు. దేశానికి సమర్థవంతమైన తీర భద్రత ఉన్నప్పుడే జాతీయ భద్రత సంపూర్ణంగా ఉన్నట్లని పేర్కొన్నారు. భారత సైన్యం, తీర రక్షక దళాలు సంయుక్తంగా విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందని, ఇరు విభాగాలు సంయుక్తంగా శిక్షణ పొందితే శత్రువులపై ఉమ్మడిగా పోరాడటానికి అవకాశముంటుందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తీర గస్తీనౌక ఐసీజీఎస్ వీర ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్
ఎక్కడ : విశాఖలోని నావల్ డాక్‌యార్డ్, ఆంధ్రప్రదేశ్
Published date : 16 Apr 2019 06:02PM

Photo Stories