టీఎస్‌ఈఆర్సీ చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు, సభ్యులుగా ఎండీ మనోహర్ రాజు(టెక్నికల్), బండారు కృష్ణయ్య (ఫైనాన్స్) ప్రమాణస్వీకారం చేశారు.
హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనం ఆడిటోరియంలో అక్టోబర్ 30న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావు, ట్రాన్స్ కో జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌గా ప్రమాణం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : తన్నీరు శ్రీరంగారావు
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌గా ప్రమాణం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : తన్నీరు శ్రీరంగారావు
ఎక్కడ : హైదరాబాద్
Published date : 31 Oct 2019 05:31PM