టి20క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు
Sakshi Education
భారత మహిళా క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
వన్డేలపై మరింత దృష్టిసారించేందుకు, 2021లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్ 3న ఆమె తెలిపింది. 36 ఏళ్ల మిథాలీ ప్రస్తుతం భారత వన్డే జట్టు సారథిగా వ్యవహరిస్తుంది.
మహిళా క్రికెట్‌లో టి20లు ప్రారంభమైన 2006 నుంచి టీమిండియా 104 మ్యాచ్‌లు ఆడితే అందులో 89 మ్యాచ్‌ల్లో మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. టి20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగుల (84 ఇన్నింగ్‌సల్లో 2,364 పరుగులు; సగటు 37.5, అత్యధిక స్కోరు 97 నాటౌట్) ఘనత మిథాలీ పేరిటే ఉంది. 2006లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఆమె చివరి మ్యాచ్‌నూ అదే ఇంగ్లండ్‌పై 2019, మార్చిలో గువాహటిలో ఆడింది. ఈ క్రమంలో 32 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించింది. వీటిలో 2012, 2014, 2016 ప్రపంచ కప్‌లున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టి20క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : మిథాలీ రాజ్

Published date : 05 Sep 2019 06:00PM