టెస్టు క్రికెట్‌కు డేల్ స్టెయిన్ వీడ్కోలు
Sakshi Education
ఆధునిక క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పేసర్లలో ఒకడైన డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
వరుస గాయాలతో ఇబ్బందిపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆగస్టు 5న ప్రకటించాడు. ఇక వన్డే, టీ20ల్లో మరింత ఎక్కువ కాలం కొనసాగేందుకు ప్రయత్నిస్తానన్నాడు. 2004లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఈ దక్షిణాఫ్రికా పేసర్ 2019, ఫిబ్రవరిలో శ్రీలంకపై చివరి టెస్టు ఆడాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్‌లో ప్రొటీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. 93 టెస్టుల్లో 439 వికెట్లు తీసిన స్టెయిన్ 1251 పరుగులు సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెస్టు ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : డేల్ స్టెయిన్
ఎందుకు : వరుస గాయాలతో ఇబ్బందిపడుతున్నందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెస్టు ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : డేల్ స్టెయిన్
ఎందుకు : వరుస గాయాలతో ఇబ్బందిపడుతున్నందున
Published date : 06 Aug 2019 05:28PM