Skip to main content

తెలుగు రచయితల 4వ మహాసభలు ప్రారంభం

విజయవాడలోని మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల వేదికగా ‘ప్రపంచ తెలుగు రచయితల 4వ మహాసభలు’ డిసెంబర్ 27న ప్రారంభమయ్యాయి.
Current Affairsమూడు రోజులపాటు జరిగే ఈ సభలను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ ప్రారంభించారు. తెలుగు భాష.. సంస్కృతి పరిరక్షణలో భాగంగా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో నివసించే సాహిత్యాభిమానులైన తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి భాషా వికాసానికి కృషి చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు.

కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు, 500 మందికిపైగా తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారిలో భాషా స్వాభిమానం తగ్గుతోందని ఆందోళన వెలిబుచ్చారు. తెలుగు భాష ఉద్ధరణకు రచయితలు కృషి చేయాలని కోరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలుగు రచయితల 4వ మహాసభలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్
ఎక్కడ : మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 28 Dec 2019 06:01PM

Photo Stories