Skip to main content

తెలంగాణలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు

తెలంగాణలో కొత్తగా ములుగు, నారయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16న ఉత్తర్వులు జారీ చే సింది.
దీంతో రాష్ట్ర భౌగోళిక స్వరూపం 33 జిల్లాలుగా విడిపోయింది. తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974, సెక్షన్ 3 ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి ఈ జిల్లాలు మనుగడలోకి వ స్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేర్కొన్నారు. ములుగు జిల్లాలో 9 మండలాలు, 336 గ్రామాలుండగా... 11 మండలాలు, 246 గ్రామాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది.

కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. అలాగే నారాయణపేట జిల్లాలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలు ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణలో కొత్తగా ములుగు, నారయణపేట జిల్లాల ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
Published date : 18 Feb 2019 05:40PM

Photo Stories