తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
Sakshi Education
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలను(ఐఎంసీటీ) పంపుతున్నట్టు కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 24న ఒక ప్రకటనలో వెల్లడించింది.
‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలు(ఐఎంసీటీ)
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : కేంద్ర హోం శాఖ
ఎక్కడ : తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర
ఎందుకు : కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలు(ఐఎంసీటీ)
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : కేంద్ర హోం శాఖ
ఎక్కడ : తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర
ఎందుకు : కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసేందుకు
Published date : 25 Apr 2020 07:02PM