Skip to main content

తెలంగాణ శాస్త్రవేతకు లూయీస్ పాశ్చర్ అవార్డు

పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త డాక్టర్ తాళ్లపల్లి మొగిలి జపాన్‌లోని అంతర్జాతీయ పట్టు కమిషన్ నుంచి ప్రతిష్ఠాత్మక ‘లూయీస్ పాశ్చర్ అవార్డు’ను అందుకున్నారు.
జపాన్‌లోని సుకుబా నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం చర్లపల్లికి చెందిన తాళ్లపల్లి మొగిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు. మల్బరీలో కొత్త వంగడాల అభివృద్ధిలో ఆయన విశేష కృషి చేశారు. 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
లూయీస్ పాశ్చర్ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : తెలంగాణ శాస్త్రవేత్త డాక్టర్ తాళ్లపల్లి మొగిలి
ఎక్కడ : సుకుబా, జపాన్
ఎందుకు : పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసినందుకు
Published date : 20 Nov 2019 04:52PM

Photo Stories