Skip to main content

తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్యను ఎంతకి పెంచారు?

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రానున్నారు.
సీనియర్‌ జిల్లా జడ్జి స్థాయి నుంచి హైకోర్టు జడ్జిగా ఏడుగురికి పదోన్నతులు కల్పించాలంటూ.. సుప్రీంకోర్టు కొలీజియం ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ జాబితాలో సీనియర్‌ జిల్లా జడ్జీలు పి.శ్రీసుధ, డాక్టర్‌ సి.సుమలత, డాక్టర్‌ జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్, ఎన్‌.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఆదాయపన్ను శాఖ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలిగా ఉన్న టి.మాధవీదేవి ఉన్నారు. ఏడుగురు కొత్త న్యాయమూర్తుల్లో నలుగురు మహిళా జడ్జీలే ఉన్నారు. సుప్రీం కొలీజియం పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించగానే.. కొత్త జడ్జీల నియామక ప్రక్రియ పూర్తికానుంది.

పోస్టుల సంఖ్య పెంచాక...
తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 12 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఏడుగురు రానున్నారు. ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Published date : 19 Aug 2021 06:33PM

Photo Stories