తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టబడి
హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ఏర్పాటుకు రూ.20,761 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు నవంబర్ 6న వెల్లడించారు. తెలంగాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలవనుందని పేర్కొన్నారు.
ఆసియా రీజినయన్‌కు కేంద్రంగా...
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ రీజియన్‌కు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉంటుంది. ఈ రీజియన్ పరిధిలో 3 అవైలబిలిటీ జోన్లు, ఒక్కో జోన్ పరిధిలో అనేక డేటా సెంటర్లు ఉంటాయి. ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2022 ప్రథమార్ధంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. స్థానికంగా ఏర్పాటయ్యే డేటా సెంటర్లన్నీ ఒకే రీజియన్‌లో పరిధిలో ఉన్నా దేనికదే స్వతంత్రంగా పనిచేస్తాయి. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంటుందని అమెజాన్ వెల్లడించింది.
చదవండి: అమెజాన్ అతిపెద్ద కార్యాలయం ఏ భారత నగరంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.20,761 కోట్లు పెట్టుబడి
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : అమెజాన్
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ఏర్పాటుకు