తెలంగాణ ఐటీ మంత్రితో సింగపూర్ జనరల్ భేటీ
Sakshi Education
తెలంగాణ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి కె.తారక రామారావుతో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది.
హైదరాబాద్‌లో నవంబర్ 19న జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సింగపూర్ నడుమ మరింత బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని కాక్‌టియన్‌కు కేటీఆర్ వివరించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి కె.తారక రామారావుతో భేటీ
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ, సింగపూర్ నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు

Published date : 20 Nov 2019 04:38PM