తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ సంస్థ?
Sakshi Education
అత్యంత తేలికైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను తయారు చేయడంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయం సాధించింది.
కాన్పూర్‌లోని డీఆర్‌డీవో సంస్థ డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అభివృద్ధి చేసిన ఈ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను... టెర్మినల్ బల్లాస్టిక్స్ రీసెర్చ్ లేబొరేటరీ(ఛండీగఢ్)లో విజయవంతంగా పరీక్షించారు. భారతీయ ఆర్మీ అవసరాలకు తగ్గట్టుగా, అత్యంత నాణ్యత ప్రమాణాలతో దీన్ని రూపొందించామని ఏప్రిల్ 1న డీఆర్‌డీవో తెలిపింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న జాకెట్ల బరువు దాదాపు పదిన్నర కిలోల బరువు ఉండగా కొత్తజాకెట్ బరువు 1.4 కిలోలు తక్కువగా ఉంటుంది. అంటే దీని బరువు తొమ్మిది కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తేలికపాటి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : డీఆర్‌డీవోకి చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్
ఎక్కడ : టెర్మినల్ బల్లాస్టిక్స్ రీసెర్చ్ లేబొరేటరీ, ఛండీగఢ్
ఎందుకు : సైనికుల సౌకర్యాన్ని పెంచడంతోపాటు మరింత రక్షణ కల్పిస్తుందని

Published date : 02 Apr 2021 06:39PM