టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గ్రెటా థన్‌బర్గ్
Sakshi Education
ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది.
మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ డిసెంబర్11న తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది.
స్పెయిన్ వేదికగా డిసెంబర్ 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా గ్రెటా(స్వీడన్) ప్రసంగించారు. వాతావరణ కాలుష్యంపై పాలకులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మణిపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ కూడా సీఓపీ25 వాతావరణ సదస్సులో ప్రసంగించింది. వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను లిసిప్రియా కోరుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణకై కృషి చేస్తున్నందుకు

Published date : 12 Dec 2019 06:31PM