Skip to main content

టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన వ్యక్తులు?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై న జో బెడైన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికై న కమలా హ్యారిస్‌లు టైమ్ మ్యాగజైన్ ‘‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020(ఈ ఏటి మేటి వ్యక్తులు)’’గా నిలిచారు.
Current Affairs
వారిద్దరూ విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని నిరూపించారని, అమెరికా కథనే మార్చారని టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచికలో వారిని కొనియాడింది.

2020 ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా తుది జాబితాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచి, జాతి వివక్ష పోరాట సంస్థలు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. వీరందరూ ఇచ్చిన పోటీని తట్టుకొని జో బెడైన్, కమలా హ్యారిస్‌లు ముందుకు దూసుకెళ్లి టైమ్ ముఖచిత్రానికెక్కారు.

అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు...
1927 నుంచి ఏటా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గౌరవిస్తోంది. 2019 ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికై న స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ 16 ఏళ్లకే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టిస్తే, 2020 ఏడాది జో బెడైన్ 78 ఏళ్ల వయసులో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచారు.

హీరోగా ఇండియన్ అమెరికన్...
టైమ్ మ్యాగజైన్ హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో ఇండియన్ అమెరికన్ రాహుల్ దుబేకి చోటు లభించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొన్న 70 మందికి పైగా నిరసనకారులకి రాహుల్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020గా ఎంపికైన వ్యక్తులు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : జో బెడైన్, కమలా హ్యారిస్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 12 Dec 2020 05:45PM

Photo Stories