టైమ్-100 నెక్ట్స్ జాబితాలో ద్యుతీ
Sakshi Education
భారత మహిళా స్టార్ అథ్లెట్, ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు నెగ్గిన ద్యుతీచంద్‌కు ‘టైమ్-100 నెక్ట్స్’ జాబితాలో చోటు దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ప్రభావం చూపగల వ్యక్తుల జాబితాలో ఆమెకు క్రీడల కేటగిరీలో చోటు లభించింది. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ రంగాల్లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురను గుర్తించి టైమ్ మేగజైన్ ప్రతీయేటా ఈ జాబితాను తయారు చేస్తుంది. ఈ జాబితాలో స్థానం దక్కడంపై ద్యుతీచంద్ సంతోషం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్-100 నెక్ట్స్ జాబితాలో చోటు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ద్యుతీచంద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్-100 నెక్ట్స్ జాబితాలో చోటు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ద్యుతీచంద్
Published date : 14 Nov 2019 05:37PM