Skip to main content

SC Legal Services Committee: లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులైన న్యాయమూర్తి?

సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ (లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ) చైర్మన్‌గా జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆగస్టు 26న గెజిట్‌ విడుదల చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ఇప్పటి వరకు ఉన్న జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌ ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సుప్రీంకోర్టులో మూడో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ను నియమించారు.

డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు...
దేశంలో డ్రోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నూతన డ్రోన్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 26న ప్రకటించింది. రాబోయే రోజుల్లో డ్రోన్‌ వినియోగం పెరగడానికి నూతన మార్గదర్శకాలు ఉపయోగపడనున్నాయి. డ్రోన్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనుంది.

గ్రీన్‌జోన్‌లో అనుమతి అక్కర్లేదు
రెడ్‌ లేదా ఎల్లో జోన్లలో డ్రోన్‌లను ఆపరేట్‌ చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి. భూమి నుంచి 400 అడుగుల ఎత్తువరకు గ్రీన్‌జోన్‌గా పేర్కొనే ప్రాంతంలో కొత్త నిబంధనల ప్రకారం డ్రోన్‌లు ఎగరడానికి అనుమతి అవసరం లేదు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ (లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌
ఎందుకు : లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా ఇప్పటి వరకు ఉన్న జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌ ఇటీవల పదవీ విరమణ చేయడంతో...
Published date : 28 Aug 2021 06:10PM

Photo Stories