స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ 12,300 కోట్లు
Sakshi Education
కేంద్ర బడ్జెట్2020-21లో భాగంగా.. దేశంలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్.. స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ 12,300 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే విదేశీ విద్యార్థుల కోసం ఇండియాలో ‘ఇండ్ శాట్ ప్రోగామ్’ని అమలు చేస్తామన్నారు. పీజీ కోర్సుల ప్రోత్సాహానికి పెద్ద ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రస్తుతమున్న జిల్లా ఆస్పత్రుల పరిధి పెంచుతామన్నారు. అదే సమయంలో నేషనల్ పోలీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఆమె ప్రకటించారు. జైల్ జీవన్ మిషన్‌కు రూ. 1150 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
Published date : 01 Feb 2020 12:10PM