స్వాతంత్య్ర దినోత్సవ వీడియో విడుదల
Sakshi Education
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వతన్’ పేరుతో రూపొందించిన వీడియో సంగీతాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో ఆగస్టు 13న విడుదల చేశారు.
దూరదర్శన్, ప్రసార భారతి సంయుక్తంగా రూపొందించిన ఈ వీడియో దేశభక్తిని రగిలిస్తుందని జవదేకర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి మరింత వన్నె తెస్తుందన్నారు. సాయుధ దళాల గౌరవార్థం, అమరవీరులకు నివాళిగా వతన్‌ను రూపొందించినట్లు దూరదర్శన్, ప్రసార భారతి పేర్కొన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వాతంత్య్ర దినోత్సవ వీడియో వతన్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : ఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వాతంత్య్ర దినోత్సవ వీడియో వతన్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : ఢిల్లీ
Published date : 14 Aug 2019 07:06PM