Skip to main content

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా నియమితులు కానున్న న్యాయమూర్తి?

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు.
Current Affairs
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం పొందిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుంది.

తెలుగువారిలో రెండో వ్యక్తి...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ రమణ ఆ పదవి పొందిన తెలుగు వారిలో రెండో వ్యక్తి. అంతకుముందు జస్టిస్‌ కోకా సుబ్బారావు (జూన్‌ 30, 1966– ఏప్రిల్‌ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : సుప్రీంకోర్టు తదుపరి సీజేగా నియమితులు కానున్న న్యాయమూర్తి?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ
ఎందుకు : ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుండటంతో...
Published date : 26 Mar 2021 05:16PM

Photo Stories