సులవేసి ద్వీపం ఏ దేశంలో ఉంది?
Sakshi Education
ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో జనవరి 15న భారీ భూకంపం సంభవించింది.
6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు.
సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు.
ఇండోనేసియా రాజధాని: జకార్తా; కరెన్సీ: ఇండోనేసియన్ రూపియా
ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు: జోకో విడోడో
Published date : 19 Jan 2021 05:53PM