స్ట్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ బిల్లు ప్రవేశపెట్టిన అమెరికా
Sakshi Education
అమెరికా దేశ ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌స)లో యూఎస్-ఇండియా స్ట్రెటజిక్ రిలేషన్‌షిప్ బిల్లును అమెరికా చట్టసభ సభ్యుల బృందం పునఃప్రవేశపెట్టింది.
హెచ్‌ఆర్- 2123 పేరిట రూపొందించిన ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్ సభలో ప్రవేశపెట్టారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే వ్యూహాత్మక ఆయుధాల విక్రయంలో భారత్‌కు ప్రాధాన్యం లభిస్తుంది. అలాగే అమెరికా నేతృత్వంలోని నాటో సభ్య దేశాలైన ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్‌లతో సమాన హోదా లభిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా దేశ ప్రతినిధుల సభ స్ట్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ బిల్లు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్
ఎందుకు : భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు

Published date : 13 Apr 2019 05:02PM