స్టార్టప్‌లలో భారత్‌కు మూడో స్థానం
Sakshi Education
విజయవంతమైన ఎక్కువ స్టార్టప్‌లను కలిగిన మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారత్ నిలిచింది.
ఈ విషయాన్ని హరున్ గ్లోబల్ యూనికార్న్ జాబితా 2019 వెల్లడించింది. ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. చైనా నుంచి 206 యూనికార్న్‌ల(స్టార్టప్‌లు)ను, అమెరికా నుంచి 203 యూనికార్న్‌లను, భారత్ నుంచి 21 యూనికార్న్‌లను హరున్ జాబితా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా హరున్ జాబితా గుర్తించిన యూనికార్న్‌లలో 80 శాతం చైనా, అమెరికా దేశాల్లోనే ఉన్నాయి. యూరోప్‌లో 35 యూనికార్న్‌లు ఉన్నాయి.
భారత్ నుంచి విజయం సాధించిన స్టార్టప్‌లలో వన్ 97 కమ్యూనికేషన్స్ (10 బిలియన్ డాలర్లు), ఓలా క్యాబ్స్ (6 బిలియన్ డాలర్లు), బైజూస్ (6 బిలియన్ డాలర్లు), ఓయోరూమ్స్ (5 బిలియన్ డాలర్లు) అగ్ర భాగాన ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టార్టప్‌లలో భారత్‌కు మూడో స్థానం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : హరున్ గ్లోబల్ యూనికార్న్ జాబితా 2019
ఎక్కడ : ప్రపంచంలో

Published date : 18 Oct 2019 05:26PM