Skip to main content

స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

దేశీయ స్టార్టప్స్‌ను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన... స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకం 2021, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
Current Affairs
ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏప్రిల్‌ 19న తెలిపారు. ప్రారంభ దశలో కీలకమైన మూలధనం లేకపోవటంతో టేకాఫ్‌ చేయలేకపోతున్న స్టార్టప్స్‌కు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న వ్యాపార ఆలోచనలకు ఈ స్కీమ్‌ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పథకం–వివరాలు
  • వచ్చే నాలుగేళ్లలో స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకం కింద రూ.945 కోట్లు కార్పస్‌ ఫండ్‌గా అందించబడుతుంది.
  • 300 ఇంక్యుబేటర్ల ద్వారా సుమారు 3,600 స్టార్టప్స్‌కు సీడ్‌ పండ్‌ను అందించాలన్నది ఈ లక్ష్యం.
  • ఈ స్కీమ్‌ అమలు, పర్యవేక్షణకు ఎక్స్‌పర్ట్స్‌ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
  • ఈఏసీ ఎంపిక చేసిన ఇంక్యుబేటర్లకు రూ.5 కోట్ల వరకు గ్రాంట్స్‌ మంజూరు చేస్తారు.
  • మరికొన్ని రకాల స్టార్టప్స్‌కు వాటి స్థాయిని బట్టి... రూ.20 లక్షలు, రూ.50 లక్షల వరకు ఫండ్స్‌ అందిస్తారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2021, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకం
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : దేశీయ స్టార్టప్స్‌ను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు...
Published date : 20 Apr 2021 06:17PM

Photo Stories