Skip to main content

శ్రీలంకలో సరికొత్త ఆంక్షలు

బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం సరికొత్త ఆంక్షలు విధించింది.
ఇందులోభాగంగా ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించకూడదని ఏప్రిల్ 29న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాలు జారీ చేశారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా, నిందితులను గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిరిసేన ప్రకటించారు.

మరోవైపు శ్రీలంక ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందరను విధుల నుంచి తప్పిస్తూ సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈస్టర్ పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిరిసేన తెలిపారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్ చేశారు. సీనియర్ డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్ చీఫ్‌గా, మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇళంగకూన్‌ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంకలో సరికొత్త ఆంక్షలు
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : శ్రీలంక ప్రభుత్వం
ఎందుకు : బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో
Published date : 30 Apr 2019 05:12PM

Photo Stories