Skip to main content

శ్రీలంకకు 3,230 కోట్ల రుణ సాయం : మోదీ

శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు 450 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,229 కోట్ల) సులభతర రుణం సాయం (లైన్ ఆఫ్ క్రెడిట్) చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Current Affairsఇందులో తీవ్రవాద నిర్మూలనకు 50 మిలియన్ డాలర్లు (రూ.358 కోట్లు) కేటాయించారు. శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో నవంబర్ 29న ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా మోదీ ఈ రుణాన్ని ప్రకటించారు.

మోదీ, గోతబయ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు వెల్లడించారు. గోతబయ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. శ్రీలంక చెరలో ఉన్న భారత జాలర్లందరినీ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంకకు 3,230 కోట్ల రుణ సాయం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : భారత్
ఎందుకు : శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు
Published date : 30 Nov 2019 05:52PM

Photo Stories