శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్ ప్రారంభం
‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి అదనంగా నీరు ఇవ్వగలిగాం. నిజాంసాగర్‌ను పూర్తి చేసుకుంటున్నాం. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో జలకళ ఉట్టిపడు తుంది. సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ రైతుల కష్టాలు తీరి దేశానికే ఆదర్శవంతమైన వ్యవ సాయ కేంద్రంగా తెలంగాణ విరాజిల్లుతుంది’ అని మంత్రులు హరీశ్, కేటీఆర్ అన్నారు.
మెతుకుసీమగా పిలిచే ఉమ్మడి మెదక్ జిల్లా పేరే మెతుకు అనే పేరు నుంచి వచ్చిందని, గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లాను ముద్దాడిన తర్వాత మొత్తం తెలంగాణకు బువ్వపెట్టే జిల్లాగా కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీటివనరులు పెరిగితే ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు
ఎక్కడ : చంద్లాపూర్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ