Skip to main content

సరిహద్దుపై కువైట్, సౌదీ అరేబియా ఒప్పందం

ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖ పొడవునా తటస్థ మండలాన్ని ఏర్పాటు చేసేందుకు కువైట్, సౌదీ అరేబియా అంగీకరించాయి.
Current Affairsఈ మేరకు కువైట్ రాజధాని కువైట్ సిటీలో డిసెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతోబాటే ఉమ్మడిగా చమురు ఉత్పత్తి పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన అవగాహనా ఒప్పందంపైనా సంతకాలు చేశారు. ఈ రెండు ఒప్పందాలను చారిత్రాత్మక విజయంగా ఇరు పక్షాలు ప్రకటించుకున్నాయి.

సరిహద్దుపై కుదిరిన ఒప్పందంలో భాగంగా 5,770 చ. కి.మీ సరిహద్దు రేఖ పొడవునా తటస్థ మండలాన్ని ఏర్పాటు చేస్తారు. నాలుగేళ్ల క్రితం యుద్ధం కారణంగా ఖఫీ, వాఫ్రా చమురు క్షేత్రాల్లో నిలిపివేసిన ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సరిహద్దుపై కువైట్, సౌదీ అరేబియా ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎక్కడ : కువైట్ సిటీ, కువైట్
ఎందుకు : ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖ పొడవునా తటస్థ మండలాన్ని ఏర్పాటు చేసేందుకు
Published date : 27 Dec 2019 05:35PM

Photo Stories