Skip to main content

స్పీకింగ్ బుక్ భగవద్గీతను రూపొందించిన సంస్థ?

న్యూఢిల్లీకి చెందిన హయోమా సంస్థ రూపొందించిన స్పీకింగ్ బుక్స్ భగవద్గీత, సంపూర్ణ హనుమాన్ చాలీసా పుస్తకాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలోని తన కార్యాలయంలో నవంబర్ 19న ఆవిష్కరించారు.
Current Affairs
ఈ పుస్తకాల్లోని విషయాలను నిరక్షరాస్యులు, వృద్ధులు, అంధులు సులభంగా తెలుసుకునే విధంగా రూపొందించారు. ఈ పుస్తకాలతో పాటు ఇచ్చే ఎలక్ట్రానిక్ పరికరాన్ని పేజీల్లోని అక్షరాలపై పెడితే ఆడియో రూపంలో శ్లోకాలు, తాత్పర్యాలు పలు భాషల్లో వినిపిస్తాయి. నచ్చిన భాషను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. సేఫ్ షాప్ ఆన్‌లైన్ సంస్థ వీటిని మార్కెటింగ్ చేస్తోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్పీకింగ్ బుక్స్ భగవద్గీత, సంపూర్ణ హనుమాన్ చాలీసా పుస్తకాల ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఎక్కడ : తిరుమల, తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎందుకు : పుస్తకాల్లోని విషయాలను నిరక్షరాస్యులు, వృద్ధులు, అంధులు సులభంగా తెలుసుకునేందుకు
Published date : 20 Nov 2020 06:09PM

Photo Stories