Skip to main content

సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు : శివన్

భూ కక్ష్యలో సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డా.కె.శివన్ ప్రకటించారు.
ఢిల్లీలో జూన్ 13న నిర్వహించిన మీడియా సమావేశంలో శివన్ ఈ మేరకు తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం పూర్తయ్యాక సూర్యుడిపై ఆదిత్య-ఎల్1 వాహకనౌక 2020 తొలి అర్ధభాగంలో పంపిస్తామని చెప్పారు. అనంతరం 2-3 సంవత్సరాల వ్యవధిలో ఫ్రాన్స్ తో కలిసి శుక్రుడిని అధ్యయనం చేసేందుకు మరో ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు.

అంతరిక్షం కేంద్రం విషయమై శివన్ వెల్లడించిన అంశాలు
  • భారతీయుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు రూ.10,000 కోట్లతో ఇస్రో చేపట్టిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కొనసాగింపుగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం
  • అమెరికా, జపాన్, కెనడా, రష్యా, ఈయూ దేశాలు కలిసి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) బరువు 420 టన్నులు ఉండగా, ఇస్రో ఏర్పాటుచేయనున్న అంతరిక్ష కేంద్రం బరువు 20 టన్నులు మాత్రమే
  • ఈ అంతరిక్ష కేంద్రంలో తొలుత వ్యోమగాములు 15-20 రోజులు గడిపేలా ఏర్పాట్లు, దాన్ని క్రమంగా విస్తరిస్తారు
  • ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉండగా ఓసారి ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2030 నాటికి మనకు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుంది
  • అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం ఐఎస్‌ఎస్‌తో కానీ, మరేదేశంతో కానీ పనిచేయబోమని శివన్ వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : ఇస్రో చైర్మన్ డా.కె.శివన్
Published date : 14 Jun 2019 05:43PM

Photo Stories