సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు నిలుపుదల
Sakshi Education
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడంతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి రషీద్ ఆగస్టు 8న ప్రకటించారు.
అయితే సంఝౌతా సర్వీసు కొనసాగుతుందని భారత అధికారులు స్పష్టత ఇచ్చారు. 1971లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంరతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్‌లోని లాహోర్, భారత్‌లోని ఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది. లాహోర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్ వరకు వెళ్తాయి.
మరోవైపు భారతీయ సినిమాల ప్రదర్శనపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు నిలుపుదల
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : పాకిస్తాన్
ఎందుకు : ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడంతో

Published date : 09 Aug 2019 05:55PM