Skip to main content

సముద్రంలో గల్లంతైన ఇండోనేషియా జలాంతర్గామి పేరు?

ఇండోనేషియాకు చెందిన ‘కేఆర్‌ఐ నంగల’ అనే జలాంతర్గామి ఏప్రిల్‌ 21న సముద్రంలో గల్లంతైంది.
Current Affairs
53 మంది సిబ్బందితో బయలుదేరిన సబ్‌మెరైన్‌ కొంతదూరం వెళ్లాక ఇండోనేషియా నేవీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇండోనేషియా ప్రభుత్వం భారత సహకారం కోరింది. స్పందించిన భారత నౌకాదళం... విశాఖ నుంచి డీప్‌ సబ్‌మెరైన్స్‌ రెస్క్యూ వెసెల్‌ (డీఎస్‌ఆర్‌వీ) ప్రత్యేక బృందాన్ని ఏప్రిల్‌ 22న రంగంలోకి దించింది. గల్లంతైన సబ్‌మెరైన్‌ బాలి తీరానికి 25 మైళ్ల దూరంలో ఉన్నట్టు డీఎస్‌ఆర్‌వీ గుర్తించింది. దానిని వెలికి తీసే ప్రయత్నాలను ప్రారంభించనున్నారు.

ప్రత్యేక ఒప్పందాలు...
ఎన్నో వేల మైళ్ల లోతులో చిక్కుకుపోయిన నౌకలను కనిపెట్టి, వాటిని వెలికితీసే సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్‌ ఉంది. గతంలో ఈ తరహా విపత్తులు సంభవించినప్పుడు సబ్‌మెరైన్‌లు, నౌకలను రక్షించే పరిజ్ఞానంపై భారత్, ఇండోనేషియా దేశాల మధ్య ప్రత్యేక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భాగంగానే కేఆర్‌ఐ నంగలను వెలికి తీసే కార్యక్రమంలో భారత్‌ సహకారం అందిస్తోంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : సముద్రంలో గల్లంతైన ఇండోనేషియా జలాంతర్గామి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 22
ఎవరు : కేఆర్‌ఐ నంగల
ఎక్కడ : ఇండోనేషియా సమీపంలోని సముద్రంలో...
Published date : 23 Apr 2021 06:19PM

Photo Stories