Skip to main content

సమర్థ్ పథకం కింద 16 రాష్ట్రాలతో ఒప్పందం

యువత, మహిళలకు శిక్షణనిచ్చి వారి సామర్థ్యాలు పెంపొందించి జౌళి రంగంలో ఉపాధి కల్పించేందుకు సమర్థ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ నే తృత్వంలో ఢిల్లీలో ఆగస్టు 14న నిర్వహించిన సదస్సులో ఈ ఒప్పందం జరిగింది. జౌళి రంగంలో వివిధ విభాగాల్లో 2020నాటికి 10 లక్షల మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ 12 వేల మందికి, తెలంగాణ 1440 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సమర్థ్ పథకం కింద 16 రాష్ట్రాలతో ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : యువత, మహిళలకు శిక్షణనిచ్చి వారి సామర్థ్యాలు పెంపొందించి జౌళి రంగంలో ఉపాధి కల్పించేందుకు
Published date : 15 Aug 2019 05:30PM

Photo Stories