స్కోచ్ అవార్డుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్’ అవార్డుల్లో సగానికిపైగా కైవసం చేసుకుని వరుసగా రెండోసారి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దిశ, పోలీస్ సేవా యాప్‌లకు బంగారు పతకాలు రాగా.. మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకుంది. పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో భాగంగా అక్టోబర్ 28న జాతీయ అవార్డులను ప్రకటించింది.
ఏపీ తర్వాత స్థానంలో...
స్కోచ్ గ్రూప్ మొత్తం 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రికార్డు స్థాయిలో 48 అవార్డులను దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(9), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్(4), హిమాచల్‌ప్రదేశ్(3), మధ్యప్రదేశ్(2), తమిళనాడు(2), ఛత్తీస్‌గఢ్(2) ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి.
ఏపీ పోలీసులు తీసుకొచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్, పోలీస్ సేవా యాప్‌లకు బంగారు పతకాలు లభించాయి. దిశ, దిశ సంబంధిత విభాగాల్లో అందిస్తున్న టెక్నాలజీ సేవలకు 5 అవార్డులు వచ్చాయి. కోవిడ్ సమయంలో అందించిన మెరుగైన సంక్షేమానికి 3 , ఏపీ పోలీస్ టెక్నికల్ విభాగానికి 13 అవార్డులు, సీఐడీకి 4, కమ్యూనికేషన్‌కు 3, విజయవాడకు 3, కర్నూలు జిల్లాకు 3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలకు రెండేసి చొప్పున అవార్డులు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణా జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్వూ :
ఏమిటి : స్కోచ్ అవార్డుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో
ఎందుకు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో