Skip to main content

సినీ గేయ రచయిత రంగభట్టర్ కన్నుమూత

తిరుపతి కల్చరల్: సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ఫిబ్రవరి 20రాత్రి కన్నుమూశారు.
తిరుపతికి చెందిన రంగభట్టార్ 1968లో టీటీడీలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య అధ్యాపకులుగా బోధనారంగంలోకి ప్రవేశించారు. ఊపిరితిత్తుల సమస్యతో వారం రోజులు తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాహిత్య శాఖ అధ్యక్షుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. రంగభట్టర్‌కు సినీ దర్శకుడు, రచయిత జేకే భారవి స్వయాన తమ్ముడు. వృత్తిరీత్యా సంస్కృత అధ్యాపకుడు కావడంతో సాహిత్యంలో మంచి పట్టు సాధించారు. 1986లో రంగవల్లి చిత్రానికి ఆయన తొలిసారిగా పాటలు రచించారు. ఆ తర్వాత శ్రీమంజునాథ, పాండురంగడు, రామదాసు, షిరిడీ సాయి, అనగనగా ఒక ధీరుడు, ఝుమ్మంది నాదం, జగద్గురు ఆదిశంకర, వెంగమాంబ, ఓం నమో వేంకటేశాయ వంటి మొత్తం 13 చిత్రాలకు అద్భుతమైన ఆధ్యాత్మికతను రేకెత్తించే పాటలను రచించి గొప్ప సినీ రచయితగా పేరు గడించారు. సంగీతాన్ని మరింత విసృ్తతం చేయాలనే సంకల్పంతో సరికొత్త పంథాలో ‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే సంగీత పుస్తకాన్ని రచించి సులభతరంగా సంగీతం నేర్చుకునేలా దోహదపడ్డారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : తిరుపతి
ఎవరు : వేదవ్యాస రంగభట్టర్
Published date : 21 Feb 2019 05:58PM

Photo Stories