సీసీఎంబీ శాస్త్రవేత్తకు రామచంద్రన్ అవార్డు
Sakshi Education
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ అమితాబ ఛటోపాధ్యాయకు సీఎస్‌ఐఆర్ - జి.ఎన్.రామచంద్రన్ అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 27న నిర్వహించిన కార్యక్రమంలో ఛటోపాధ్యాయకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. జీవ, సాంకేతిక శాస్త్రాల్లో పరిశోధనలకుగాను ఛటోపాధ్యాయకు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) అవార్డు దక్కింది.
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ జాన్ మొండల్ సీఎస్‌ఐఆర్ యువ శాస్త్రవేత్త-2019కు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్ చేతుల మీదుగా జాన్ మొండల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Published date : 01 Oct 2019 05:42PM