Skip to main content

సీసీఎంబీ ప్రధాన కార్యలయం ఏ నగరంలో ఉంది?

కరోనా వైరస్ గాలిలో ప్రయాణించగలదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ప్రకటించింది.
Current Affairs

చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీతో కలసి నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని జనవరి 5న తెలిపింది. హైదరాబాద్, చండీగఢ్‌లో మూడు చొప్పున ఆసుపత్రుల్లో ప్రయోగాలు నిర్వహించినట్లు పేర్కొంది. వ్యాధిగ్రస్థులు ఎక్కువ కాలం గడిపిన గదిలో రెండు మీటర్ల కంటే దూరంలోనూ గాల్లో వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించింది.

  • సీసీఎంబీ ప్రధాన కార్యాల‌యం హైదరాబాద్లో ఉంది.
  • ప్రస్తుతం సీసీఎంబీ డెరైక్టర్‌గా డాక్టర్ రాకేశ్ కె. మిశ్రా ఉన్నారు.
Published date : 06 Jan 2021 05:36PM

Photo Stories