Skip to main content

సీజేఐ కుట్రపై ఏకసభ్య కమిటీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కుట్ర వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు నియమించింది.
సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

త్రిసభ్య కమిటీ నుంచి తప్పకున్న జస్టిస్ రమణ
సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన కమిటీ నుంచి జస్టిస్ ఎన్‌వీ రమణ తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సీజేఐకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి జస్టిస్ బాబ్డే నేతృత్వం వహిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీజేఐ కుట్ర వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 26 Apr 2019 06:51PM

Photo Stories