సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులైన అధికారి?
Sakshi Education
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆలాపన్ బందోపాధ్యాయ మే 31న పదవీ విరమణ చేశారు.
అనంతరం ఆయనను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుగా నియమిస్తు రాష్ట్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జూన్ 1 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చింది. ఆలాపన్‌ను ఢిల్లీకి వచ్చి రిపోర్టు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మే 28న ఆదేశించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. కేంద్ర వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన సీఎం మమత... ఆయనను రిలీవ్ చేయడానికి అంగీకరించలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుగా నియామకం
ఎప్పుడు : మే 31
ఎవరు : ఆలాపన్ బందోపాధ్యాయ
క్విక్ రివ్యూ :
ఏమిటి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుగా నియామకం
ఎప్పుడు : మే 31
ఎవరు : ఆలాపన్ బందోపాధ్యాయ
Published date : 02 Jun 2021 06:26PM