Skip to main content

సీఏఏపై కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్ నివేదిక

భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)పై అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్(సీఆర్‌ఎస్) నివేదికను రూపొందించింది.
Current Affairsఈ నివేదికను ఆ దేశ కాంగ్రెస్ సభ్యులకు అందజేసింది. సీఆర్‌ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్య్ర అధ్యయన విభాగం. ప్రాముఖ్యత సంతరించుకున్న దేశీయ, అంతర్జాతీయ అంశాలపై అధ్యయనం చేసి ఈ కమిటీ కాంగ్రెస్ సభ్యులకు నివేదికలు సమర్పిస్తుంటుంది. అయితే వీటిని కాంగ్రెస్ అధికారిక నివేదికలుగా మాత్రం పరిగణించదు.

సీఆర్‌ఎస్ నివేదికలోని అంశాలు
  • సీఏఏ చట్టాన్ని, ఎన్పీఆర్‌తో కలిపి అమలు చేయడం వల్ల భారత్‌లోని ముస్లిం వర్గంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
  • భారత చరిత్రలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తున్నారు.
  • 955 నాటి పౌరసత్వ సవరణ చట్టానికి పలు సార్లు సవరణలు చేశారని.. కానీ ఎప్పుడూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు.
  • తాజా సవరణ భారత రాజ్యాంగంలో అధికరణ 14, 15ని సవాల్ చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఏఏపై ప్రభుత్వ వాదనను కూడా సీఆర్‌ఎస్ నివేదికలో పేర్కొంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో ముస్లింలు ఎలాంటి హింసకు గురికావడం లేదని అందుకే వారికి పౌరసత్వం కల్పించడం లేదన్న సీఏఏ మద్దతుదారుల వాదనని ఉటంకించింది. తాజా చట్టం వల్ల దేశంలోని ఏ ఒక్క పౌరుడూ పౌరసత్వం కోల్పోరన్న ప్రభుత్వ హామీని కూడా నివేదికలో పొందుపరిచారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)పై నివేదిక
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్(సీఆర్‌ఎస్)
Published date : 27 Dec 2019 05:37PM

Photo Stories