సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత
Sakshi Education
సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా(68) కన్నుమూశారు.
కోవిడ్–19 కారణంగా ఏప్రిల్ 16న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. బిహార్ కేడర్‌కు చెందిన 1974 బ్యాచ్ అధికారి రంజిత్ 21 ఏళ్లకే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఐటీబీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సిన్హా హయాంలో బొగ్గు కుంభకోణంపై సీబీఐ చేపట్టిన దర్యాప్తు వివాదస్పదమైంది. అనంతరం సీబీఐ 2జీ కుంభకోణంపై చేపట్టిన దర్యాప్తు చుట్టూ కూడా వివాదం ఏర్పడింది. ఈ కుంభకోణంలోని కీలక సూత్రధారులు కొందరు సిన్హా నివాసానికి వెళ్లినట్లు వెల్లడైంది. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ చీఫ్‌గా ఉన్న సిన్హా ఆ కేసు విచారణ నుంచి వైదొలిగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ మాజీ డైరెక్టర్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : రంజిత్ సిన్హా(68)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కోవిడ్–19 కారణంగా...
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ మాజీ డైరెక్టర్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : రంజిత్ సిన్హా(68)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కోవిడ్–19 కారణంగా...
Published date : 19 Apr 2021 11:38AM