సీఐఐ నూతన ప్రెసిడెంట్‌గా నియమితులైన వ్యక్తి?
Sakshi Education
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా 2021–22సంవత్సరానికిగాను టాటా స్టీల్ సీఈవో, ఎండీ టి.వి.నరేంద్రన్ నియమితులయ్యారు.
2016–17లో సీఐఐ తూర్పు ప్రాంత చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు.వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐజంషెడ్‌పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్‌గా బజాజ్ ఫిన్‌సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ ఎన్నికయ్యారు. అలాగే సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా నియామకం
ఎప్పుడు : మే 31
ఎవరు : టాటా స్టీల్ సీఈవో, ఎండీ టి.వి.నరేంద్రన్క్విక్ రివ్యూ :
ఏమిటి : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా నియామకం
ఎప్పుడు : మే 31
Published date : 02 Jun 2021 06:11PM