సీ4సీ చాలెంజ్‌కు దేశంలోని ఎన్ని నగరాలు ఎంపికయ్యాయి?
Sakshi Education
నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి స్మార్ట్ సిటీస్ మిషన్... సైకిల్ ఫర్ ఛేంజ్(సీ4సీ) చాలెంజ్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యానికి మేలు చేయడానికి సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని, దీని వల్ల నగరాల్లో కాలుష్యం సైతం తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సీ4సీ కార్యక్రమం స్టేజీ-1 కింద హైదరాబాద్, వరంగల్ నగరాలుసహా దేశంలోని 25 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. దేశ వ్యాప్తంగా 107 నగరాలు సీ4సీ చాలెంజ్‌కు రిజిస్ట్రర్ కాగా, తొలి విడత కింద ఎంపిక చేసిన 25 నగరాల పేర్లను కేంద్రం ఫిబ్రవరి 18న ప్రకటించింది.
నర్చరింగ్ నెబర్‌హుడ్ చాలెంజ్...
నగరాలు, పట్టణ ప్రాంతంలో 0-5 ఏళ్ల బాలబాలికలకు సురక్షితమైన, మెరుగైన సదుపాయాలు కలిగిన పరిసరాలను అందించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘నర్చరింగ్ నెబర్ హుడ్’ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని కింద హైదరాబాద్, వరంగల్ నగరాలుసహా దేశంలోని మొత్తం 25 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైకిల్ ఫర్ ఛేంజ్(సీ4సీ) చాలెంజ్‌కు 25 నగరాలు, పట్టణాలు ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి

Published date : 19 Feb 2021 05:57PM