Skip to main content

సిద్దిపేట కలెక్టర్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు

తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికు జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు లభించింది.
ఈ మేరకు కేంద్రప్రభుత్వం పర్యవేక్షణలోని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలోని కమిటీ ఆగస్టు 10నప్రకటించింది. ఢిల్లీలో ఆగస్టు 21న జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డునుఅందజేయనున్నట్లు తెలిపింది. పభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను, పథకాలను ప్రజలకు చేరవేస్తూ మంచి పాలనా ప్రక్రియకు నాంది పలికే కలెక్టర్లకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డును అందజేస్తారు. దేశంలోని 688 జిల్లాల్లో కలెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని రెండేళ్లకోసారి అవార్డులను ప్రకటిస్తారు. ప్రధాని మోదీ కమిటీ చైర్మన్‌గా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ చైర్మన్ వివేక్ గోయెంక, రమానాథ్ గోయెంక సభ్యులుగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ కమిటీ అవార్డులను ప్రకటిస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి
ఎందుకు : ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసినందుకు
Published date : 12 Aug 2019 05:39PM

Photo Stories