సెబీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
Sakshi Education
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలాన్ని 18 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2020, సెప్టెంబర్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 28 దాకా ఆయనే సెబీ చైర్మన్ గా కొనసాగుతారని ప్రకటించింది. త్యాగి పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. 2020 ఏడాది తొలినాళ్లలోనే ఆరు నెలల పాటు ఆగస్టు ఆఖరు దాకా ప్రభుత్వం పొడిగించింది. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్ల ముందు అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో త్యాగిని సెబీ చైర్మన్ గా మరో దఫా కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా రిటైరయిన త్యాగి తొలిసారిగా 2017 మార్చి 1న మూడేళ్ల వ్యవధికి సెబీ చైర్మన్ గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 09 Aug 2020 12:22PM