సాల్‌కాంప్‌కు నోకియా ప్లాంటు : కేంద్ర ఐటీ శాఖ
Sakshi Education
ఒకప్పటి మొబైల్స్ దిగ్గజం నోకియాకు చెందిన చెన్నై ప్లాంటును మొబైల్ చార్జర్ల తయారీ సంస్థ సాల్‌కాంప్ కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు.
ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు నవంబర్ 25న తెలిపారు. దాదాపు పదేళ్లుగా మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీని సాల్‌కాంప్ పునరుద్ధరించనున్నట్లు, 2020 మార్చి నుంచి ఈ ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. మొబైల్ చార్జర్ల తయారీలో సాల్‌కాంప్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఐఫోన్‌లకు అవసరమైన చార్జర్లను టెక్ దిగ్గజం యాపిల్‌కు సరఫరా చేస్తోంది.
ఐఫోన్ ఎక్స్‌ఆర్..
యాపిల్ తాజాగా ఐఫోన్ ఎక్స్‌ఆర్ మొబైల్స్‌ను భారత్‌లోనే తయారు చేయడం ప్రారంభించినట్లు మంత్రి రవి శంకర్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత ఊతమివ్వనున్నట్లు వివరించారు. తైవాన్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సంస్థ విస్ట్రన్ ద్వారా యాపిల్ ప్రస్తుతం ఐఫోన్ 6ఎస్, 7లను భారత్‌లో తయారు చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాల్‌కాంప్‌కు నోకియా చెన్నై ప్లాంటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్

Published date : 26 Nov 2019 05:46PM